Header Banner

మహిళల రక్షణకు స్పెషల్ వింగ్ - ప్రత్యేక యాప్! ఏపీ హోంమంత్రి కీలక ప్రకటన!

  Sat Feb 22, 2025 11:15        Politics

మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ ప్రాధాన్యతలకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. హెల్ప్ డెస్కుల ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు. మార్చి 8న మహిళా దినోత్సవం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ ను ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 

ఇది కూడా చదవండి: తల్లికి వందనం పథకంపై అపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్! డేట్ ఫిక్స్! ఈ నెలలో...

 

అంతకు ముందు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు మంత్రి అనితను కలిశారు. నరసరావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్ ఇటీవల బోర్డు తిప్పేయడంతో సుమారు రూ.200 కోట్ల మేర మోసం జరిగిందని, బాధితుల్లో పేద, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారని వివరించారు. బాధితులకు సరైన న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఘటనలో నిందితులను అరెస్టు చేయడం జరిగిందని, త్వరలోనే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సాయి సాదన చిట్ ఫండ్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VangalapudiAnitha #NewApp #Women #Protection #AndhraPradesh